
549views
ఆసియా రోయింగ్ ఛాంపియన్‌షిప్ లో భారత క్రీడాకారులు అర్జున్ లాల్ - రవి సత్తా చాటారు. పురుషుల డబుల్స్ లో వీరి జోడీ స్వర్ణం గెలుచుకుంది. శనివారం జరిగిన రేసులో అర్జున్ - రవి జంట 6 నిమిషాల 57.8 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచింది. ఈ క్రమంలో చైనా, ఉజ్బెకిస్థాన్ లను వెనక్కి నెట్టింది.
సింగిల్స్ లో పర్మీందర్ సింగ్ రజతం గెలిచాడు. ఫైనల్ లో పర్మీందర్ 8 నిమిషాల 7.32 సెకన్లలో లక్ష్యాన్ని అందుకుని రెండో స్థానంలో నిలిచాడు. షఖ్‌బోజ్ స్వర్ణం కైవసం చేసుకున్నాడు. శనివారం భారత రోయర్లు మరో ఐదు, ఫైనల్స్ బరిలో దిగే నేపథ్యంలో మన ఖాతాలో మరిన్ని పతకాలు చేరే అవకాశాలున్నాయి.





