News

సుల్తాన్‌పూర్‌లో లవ్‌ జిహాద్‌!

704views
  • మహిళను మోసం చేసిన ఫహీమ్‌

  • పెళ్ళి కోసమే ‘హిందు’ ముసుగు

  • తర్వాత ఇస్లాం పుచ్చుకోమని భార్యపై ఒత్తిడి

  • పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

  • ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘటన

సుల్తాన్‌పూర్‌: ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌కు చెందిన 35 ఏళ్ల ప్రతిభా సోనీ అనే హిందూ మహిళ 10 రోజుల క్రితం సుల్తాన్‌పూర్‌ పోలీసు స్టేషన్‌లో భర్తపై కేసు పెట్టింది. ముస్లిం అయిన తన భర్త తనను ఆర్యసమాజ్‌ ఆలయంలో వివాహం చేసుకున్నాడని, ఆ తర్వాత ఇస్లాంలోకి మారమని బలవంతం చేశాడని ఆరోపించింది. తన భర్త మరో మహిళను కూడా మోసం చేశాడని, పెళ్ళి సాకుతో కొన్నాళ్ళుగా ఆమెను లైంగికంగా వేధిస్తున్నాడని ఆ మహిళ ఆరోపించింది.

ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి అయిన ప్రతిభా సోనీ చేసిన ఫిర్యాదు ఆధారంగా, ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ఆమె భర్త ఫహీమ్‌ను వేధింపులు, నేరపూరిత బెదిరింపులతో సహా అనేక ఆరోపణలపై అరెస్టు చేశారు. బాధితురాలి కథనం ప్రకారం…

2018లో ఇద్దరూ ఆర్యసమాజ్‌ ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఫహీం హిందూ మతాన్ని స్వీకరించాడు. రాజేష్‌గా పేరు మార్చుకున్నాడు. పెళ్ళి తర్వాత వీరిద్దరి మధ్య సంబంధం బెడిసికొట్టింది. ఆమె గర్భం దాల్చిన మూడు నెలల తర్వాత, ఫహీమ్‌ ఇస్లాంలోకి మారాలని, నిఖా చేసుకోవాలని ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. మోసాన్ని తెలుసుకున్న తర్వాత పెద్ద మనుషుల సమక్షంలో తనతో కలిసి జీవించడానికి ఫహీమ్‌ అంగీకరించాడు. మరుసటి రోజు, అతను కూడా ఆమెతో కలిసి వెళ్ళాడు. కొన్ని వారాల తర్వాత అతను మళ్లీ కనిపించకుండా పోయి ఆమెను దూరం పెట్టాడు. దీంతో ఆమె పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించింది. మార్చి 20, 2018న ‘ఆర్య సమాజ్‌ మందిర్‌’ జారీ చేసిన తన వివాహ ధ్రువీకరణ పత్రాన్ని చూపించింది.

Source: VskKerala

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి