News

బిపిన్ రావత్ మరణంపై అసభ్యకర వ్యాఖ్యలు… ఇద్ద‌రి అరెస్ట్

747views

జమ్మూ కశ్మీర్: తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ సహా 13 మంది మృతి చెందారు. ఆయన మరణంపై దేశ ప్రజలు చింతిస్తూ ఉండగా.. కొందరు మతోన్మాదులు మాత్రం అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాంటి వారిపై పోలీసు యంత్రాంగం కన్నెర్ర జేసింది.

జనరల్ బిపిన్ రావత్ మరణంపై సోషల్ మీడియాలో అత్యంత అభ్యంతరకరమైన పోస్టులు చేసినందుకు జమ్మూ కశ్మీర్ పోలీసులు రాజౌరి సమీపంలోని ఒక గ్రామానికి చెందిన దుకాణదారుని అరెస్టు చేశారు. అయితే, పోలీసులు అతని పేరును వెల్లడించలేదు. అయితే అతనిపై రాజౌరి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నిందితులపై తదుపరి విచారణ చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. అంతకుముందు, రావత్ మరణాన్ని సెలెబ్రేట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన టోంక్‌కు చెందిన 21 ఏళ్ల జవాద్ ఖాన్‌ను రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి