News

పొగాకు ఉత్పత్తులపై నిషేధం పొడిగింపు

562views

అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్లో గుట్కా, పాన్ తదితర పొగాకు ఉత్పత్తులపై మరో ఏడాది పాటు నిషేధం పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆహార భద్రతా ప్రమాణాల విభాగం నోటిఫికేషన్ ఇచ్చింది. ఆహార భద్రతా ప్రమాణాల చట్టం నిబంధనల మేరకు.. 2021 డిసెంబరు ఏడో తేదీ నుంచి ఏడాది పాటు గుట్కా ఉత్పత్తులపై నిషేధం పొడిగిస్తున్నట్టు పేర్కొన్నారు. గుట్కా, ఖైనీ, పాన్ మసాలాలు, నమిలే పొగాకు, నికోటిన్ ఉత్పత్తులకు సంబంధించి.. తయారీ, నిల్వ, సరఫరా, రవాణా లాంటి అంశాలపై ఈ నిషేధం వర్తిస్తుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి