News

దేశంలో రెండు ఒమిక్రాన్‌ కేసులు గుర్తింపు: కేంద్రం

681views

న్యూఢిల్లీ: కరోనా కొత్త రకం వేరియంట్​ ‘ఒమిక్రాన్‌’ దేశంలోకి ప్రవేశించింది. దేశంలో రెండు ఒమిక్రాన్‌ కేసులు గుర్తించినట్టు కేంద్రం వెల్లడించింది. కర్ణాటకలోనే ఈ రెండు కేసులు నమోదైనట్టు పేర్కొంది. 66, 46 ఏళ్లు ఉన్న పురుషుల్లో కొత్తరకం వైరస్​ గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్​ సెక్రటరీ లవ్​ అగర్వాల్​ చెప్పారు.

ఇదిలా ఉంటే ఒమిక్రాన్‌ గురించి ఆందోళన అవసరం లేదని పెర్కొన్నారు. కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని వివరించారు. 24 గంటల క్రితం ఒమిక్రాన్‌ కేసులను గుర్తించినట్టు, జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం 37 ప్రయోగశాలలు ఏర్పాటు లవ్​ అగర్వాల్​ వెల్లడించారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి