News

సంతాన సాఫల్య కేంద్రాల నియంత్రణకు కేంద్రం బిల్లు

415views

న్యూఢిల్లీ: సంతాన సాఫల్య కేంద్రాలను నియంత్రించేందుకు ఉద్దేశించిన అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ బిల్లుకు లోక్‌సభ బుధవారం ఆమోదం తెలిపింది. పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సుల ఆధారంగా చేసిన సవరణలతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. సంతాన సాఫల్య కేంద్రాలపై నియంత్రణ, పర్యవేక్షణ కోసం కేంద్రం ఈ బిల్లును తీసుకువచ్చింది. సింగిల్​ పేరెంట్స్​, ఎల్​జీబీటీక్యూ కమ్యూనిటీలు ఈ ప్రక్రియను వినియోగించటం నుంచి మినహాయించొద్దని ప్రభుత్వాన్ని పలువురు సభ్యులు కోరారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి