
365views
-
డ్రగ్స్ సరఫరా చేయడానికంటున్న నిఘా వర్గాలు
జమ్ము: భారత సరిహద్దుల్లోకి చైనా డ్రోన్లు తరచూ చొరబడుతున్నాయి. పంజాబ్, జమ్ము ప్రాంతాల్లో ఎక్కువగా ఇవి కనిపిస్తున్నాయి. ‘మాదక ద్రవ్యాలను సరఫరా చేసేందుకే వీటిని వాడుతున్నట్టు తమ పరిశోధనలో తేలింది’ అని బీఎస్ఎఫ్ వర్గాలు తెలిపాయి. చిన్న పేలోడ్‌లను మోసుకెళ్లగలిగే సామర్థ్యం ఉన్న ఈ డ్రోన్లను 95 శాతం డ్రగ్స్ సరఫరాకే ఉపయోగిస్తున్నారని పేర్కొన్నాయి. అయితే, దేశ భద్రతకు ఆందోళన కలిగించే వీటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు పరిష్కారాలు మనవద్దు ఉన్నాయని స్పష్టం చేశారు. భారత్-పాక్ సరిహద్దులో ఇప్పటి వరకు కనీసం 67 డ్రోన్లు కనిపించాయని పేర్కొన్నాయి.





