
357views
-
ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ నెల నాలుగోతేదీనాటికి తుపానుగా మారి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు ఉభయగోదావరి జిల్లాలపై పెను ప్రభావం చూపే అవకాశముంది. ఈ నెల మూడు, నాలుగు తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతోపాటు గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.





