News

ముగ్గురు స్లీపర్‌ సెల్స్‌ అరెస్ట్‌

497views

పాలీ: రెండు వేర్వేరు ఘటనల్లో, పాకిస్థాన్‌ కోసం గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై రాజస్థాన్‌ పోలీసులు ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. వీరు పాలీ, జైసల్మేర్‌కు చెందిన వారు. పాలీకి చెందిన వాడిని అజారుద్దీన్‌ మేవాత్‌గా గుర్తించారు. మరో వ్యక్తి నిబాబ్‌ ఖాన్‌ సహచరుడు ఫతాన్‌ ఖాన్‌గా నిర్ధారించారు. నిందితుల వద్ద నుంచి కొన్ని కీలక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

ఈ నెల 26న పాలీ జిల్లాలోని రాస్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఆర్మీ కంటోన్మెంట్‌ ప్రాంతంలో అజారుద్దీన్‌ మేవత్‌ అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఆర్మీ ఇంటెలిజెన్స్‌ విభాగం పట్టుకుంది. జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవానేని కలవాలనుకుంటున్నట్టు చెప్పాడు. అతడిని పోలీసులకు అప్పగించారు. రాజస్థాన్‌ పోలీసులు బీవార్‌లోని కిషన్‌గంజ్‌ ప్రాంతంలోని అతని ఇంటి నుండి కొన్ని కోడెడ్‌ డాక్యుమెంట్లు, మ్యాప్‌లు, డైరీని స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. డైరీ చివరి పేజీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు సంబంధించిన సమాచారంతో పాటు మిషన్‌ అకంప్లిష్డ్‌ అని రాశారు.

విచారణలో అతడిని మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లా జయోరాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆరేళ్లుగా బీవర్‌లో నివాసం ఉంటూ కూరగాయలు విక్రయిస్తున్నాడు. నిబాబ్‌ ఖాన్‌ అనుమానిత ఐఎస్‌ఐ స్లీపర్‌ సెల్‌కు చెందిన వ్యక్తి. చందన్‌ రోడ్డులో మొబైల్‌ సిమ్‌ కార్డులు, జిరాక్స్‌ దుకాణం నడుపుతున్న నిందితుడు పాకిస్థాన్‌ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ కోసం చాలా కాలంగా గూఢచర్యం చేస్తున్నాడు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి