
559views
చెన్నై: భారీ వర్షాలు, వరదలతో అల్లాడుతున్న తమిళనాడులో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. వెల్లూరు నగరానికి 59 కిలోమీటర్ల దూరంలో 25 కిలోమీటర్ల లోతులో భూమి కంపించింది. వెల్లూరులో భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలాజీ తెలిపింది. తెల్లవారుజామున భూప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందారు. ఇళ్లలో నిద్రపోతున్న జనం భూప్రకంపనల భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం లేదని అధికారులు చెప్పారు.





