News

గన్నవరం శివారు ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ

793views

గ‌న్న‌వ‌రం: కృష్ణా జిల్లా గన్నవరం శివారులో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. సుమారు 11 నుంచి 11:30 గంటల మధ్యలో ఆలయంలోకి చొరబడిన దుండగులు రాడ్లతో హుండీలు, తాళాలు పగులకొట్టి బంగారం ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారు. సుమారు 10 కాసులు బంగారం, 16 కిలోల వెండి, 20 కిలోల రాగితో పాటు హుండీలో ఉన్న నగదును కూడా దోచుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకొనేందుకు చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. ఆంజనేయ స్వామి విగ్రహంపై ఉన్న ఆభరణాలును కూడా దోచుకెళ్లినట్టు ఆలయ అర్చకులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి