News

కొవిడ్ కోర‌ల్లో చైనా!

635views
  • ఆంక్షలు సడలిస్తే సంక్షోభమే

  • వెల్లడించిన తాజా పరిశోధన

బీజింగ్‌: చైనా సరిహద్దులను తెరిస్తే కరోనా వైరస్‌ వ్యాప్తిపై పెకింగ్‌ యూనివర్సిటీ గణిత శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టారు. ప్రయాణ ఆంక్షలను తొలగించి, కొవిడ్‌ కట్టడికి ఇతర దేశాలు అనుసరిస్తున్న విధానాన్ని పాటిస్తే చైనాలో నిత్యం 6.3 లక్షల కొవిడ్‌ కేసులు బయటపడతాయని వారు హెచ్చరించారు. అమెరికా, బ్రిటన్‌, ఇజ్రాయెల్‌, స్పెయిన్‌, ఫ్రాన్స్‌లలో ఆగస్టులో ఉన్న కొవిడ్‌ విజృంభణ సమాచారాన్ని నిపుణులు విశ్లేషించారు.

ఆయా దేశాలు కొవిడ్‌ కట్టడికి అనుసరిస్తున్న వ్యూహాన్ని చైనాలో అమలు చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయనే అంచనాలను రూపొందించారు. ఆగస్టు నెలలో అమెరికాలో నిత్యం లక్షా 50 వేల పాజిటివ్ కేసులు బయటపడ్డాయని.. అదే వ్యూహాన్ని పాటిస్తే చైనాలో నిత్యం 6.3లక్షల కేసులు వెలుగు చూస్తాయని హెచ్చరించారు. ఒకవేళ బ్రిటన్‌ వ్యూహాన్ని పాటిస్తే రోజుకు 2.75 లక్షల కేసులు, ఫ్రాన్స్‌ విధానాన్ని అమలు చేస్తే 4.54 లక్షల కేసులు చైనాలో బయటపడతాయని హెచ్చరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి