
424views
మణిపూర్: ప్రపంచంలో అత్యంత ఎత్తైన స్తంభపు వంతెనను రైల్వే శాఖ మణిపుర్లో నిర్మిస్తోంది. జిరిబామ్-ఇంఫాల్ రైల్వే ప్రాజెక్టులో భాగంగా.. 141 మీటర్ల ఎత్తైన స్తంభం నిర్మిస్తుండగా.. ప్రపంచంలోనే ఇది ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ పిల్లర్‌గా నిలవనుందని రైల్వేశాఖ తెలిపింది. 111 కిలోమీటర్ల పొడవుతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయితే జిరిబామ్-ఇంఫాల్ మధ్య ప్రయాణ సమయం 2:30 గంటలు తగ్గనుంది. హిమాలయ కొండల్లోని ఈ ప్రాజెక్టులో 47 సొరంగాలు, 156 వంతెనలు ఉన్నాయి. 2023 చివరి నాటికి ఇది అందుబాటులోకి రానుంది.





