
675views
పలాస: ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పలాస వద్ద 108 అంబులెన్స్‌ను రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి అంబులెన్సు డ్రైవరు, వైద్య నిపుణుడు సురక్షితంగా బయటపడ్డారు. అంబులెన్స్‌ను రైలు దాదాపు 100 మీటర్ల దూరం వరకూ ఈడ్చుకెళ్లింది. ఓ రోగిని తీసుకొచ్చేందుకు శనివారం రాత్రి సుమారు 7.30 ప్రాంతంలో ప్లాట్‌ఫామ్‌పైకి అంబులెన్స్ వెళ్తుండగా ఈ దుర్ఘటన సంభవించింది. అయితే, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కేసు దర్యాప్తులో ఉంది.
Source: EtvBharat





