
-
అమెరికా, చైనా వెనుకడుగు…
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల్లో భారతదేశం అమెరికా, చైనాల కంటే ముందంజలో ఉంది. ఈ మేరకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఫైనాన్షియల్ ఒలంపిక్స్‌లో ప్రపంచంలో మరే దేశానికి అందనంత ఎత్తులో భారత్ ఉందంటూ ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఇటీవల ఎకానమిక్ ఇంటిలిజెన్స్ యూనిట్ అనే(ఈఐయూ) సంస్థ ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ పేమెంట్స్, రియల్ టైం ట్రాన్సాక్షన్లకు సంబంధించి సర్వే చేపట్టింది. అందులో ఇండియా 25.5 బిలియన్ల ట్రాన్సాక్షన్లతో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా నిలిచింది.
భారత్ తర్వాత చైనా 15.7 దక్షిణ కొరియా 6, థాయ్‌లాండ్ 5.2, జిబ్రాల్టర్ 2.8, జపాన్ 1.7, బ్రెజిల్ 1.3, అమెరికా 1.2 బిలియన్ల రియల్‌టైం ట్రాన్సాక్షన్లు ఉన్నట్టు ఈఐయూ ప్రకటించింది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్(యూపీఊ) సిస్టమ్ వచ్చిన తర్వాత భారత్‌లో డిజిటల్ పేమెంట్లు ఊపందుకున్నట్టు పేర్కొంది.
Source: Nijamtoday