
404views
జమ్ము: ఉగ్రవాదులకు నిధులు సమకూర్చేందుకు పాకిస్థాన్ పెద్ద మొత్తంలో డ్రగ్స్ తరలిస్తోందని జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. ఓ ప్రణాళిక ప్రకారం మాదకద్రవ్యాలు రవాణా చేసి స్థానిక యువతను బానిసలను చేస్తోందని ఆరోపించారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, జమ్ముకాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన దిల్బాగ్.. ఈ వ్యాఖ్యలు చేశారు.
జాజర్ కొట్లీలో పట్టుబడ్డ 52 కిలోల హెరాయిన్, పూంచ్, బారాముల్లా, కుప్వారా వంటి సరిహద్దు ప్రాంతాల్లో డ్రగ్స్ కలకలం సృష్టించాయి. ఈ ఘటనలను ఉద్దేశిస్తూ దిల్బాగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కుట్రలు ఫలించేందుకు పాక్ స్థానిక యువతను బలిచేస్తోందని దిల్బాగ్ పేర్కొన్నారు. డ్రగ్స్ రవాణాను కట్టడి చేసేందుకు పోలీసులు మరింత సమర్థవంతంగా పనిచేయాలన్నారు.