
621views
-
రూ.50 లక్షల కోట్లకు చేరిన రుణాలు
-
స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాక్ వెల్లడి
-
ఇమ్రాన్ ఖాన్ పాలనలో ఆర్థిక తిరోగమనం
ఇస్లామాబాద్: పాకిస్థాన్ అప్పుల ఊబిలోకి కూరుకుపోతోందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ స్పష్టం చేసింది. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి పాక్ అప్పులు రూ. 50 లక్షల కోట్లు దాటినట్టు నివేదికలో పేర్కొంది. ఇమ్రాన్ ఖాన్ ప్రధాని అయ్యాక పరిస్థితి దిగజారినట్టు తెలుస్తోంది.
బాకీ ఉన్న రూ.50.5 లక్షల కోట్లలో రూ.20 లక్షల కోట్లు ఇమ్రాన్ ఖాన్ హయాంలోనే పెరిగినట్టు ఎస్బీపీ తెలిపింది. గడిచిన 39నెలల్లో 70శాతం అప్పులు పెరిగాయని స్థానిక మీడియా పేర్కొంది. 2018 జూలై నుంచి 2021 జూన్ మధ్య రూ.14.9 లక్షల కోట్ల రుణాన్ని పాక్ ప్రభుత్వం పొందినట్లు సమాచారం.





