
363views
-
52 మంది సజీవదహనం
మాస్కో: రష్యాలోని సైబేరియాలో ఉన్న ఓ బొగ్గు గనిలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 52 మంది ప్రాణాలు కోల్పోయారు. 820 అడుగుల లోతులో జరిగిన ఈ ప్రమాదం నుంచి 239 మందిని అధికారులు రక్షించారు. వీరిలో తీవ్రంగా గాయపడిన 44 మందిని ఆసుపత్రికి తరలించారు. దుర్ఘటనపై అధ్యక్షుడు పుతిన్ సంతాపం తెలిపారు. గాయపడిన వారికి అన్ని విధాల సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.





