News

ఏపీలో కేంద్ర బృందం పర్యటన

618views

న్యూఢిల్లీ: వరద నష్టం అంచనా వేసేందుకు కేంద్ర బృందం నేటి నుంచి మూడు రోజులపాటు చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనుంది. కేంద్ర హోంశాఖ సలహాదారు కునాల్ సత్యార్ధి నేతృత్వంలో రెండు బృందాలు పర్యటించనున్నాయి. కేంద్రం నుంచి వచ్చే ఏడుగురు సభ్యులు రెండు బృందాలుగా విడిపోయి మూడు జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ నెల 26న చిత్తూరు, 27న చిత్తూరు, కడప, 28న నెల్లూరు జిల్లాల్లో పర్యటించి వరద నష్టం అంచనా వేస్తారు. 29న ముఖ్యమంత్రి జగన్​తో భేటీ అవుతారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి