
426views
మిజోరం: మిజోరం ఈశాన్య ప్రాంతంలోని తెంజావల్లో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల15నిమిషాల సమయంలో భూప్రకంపనలు వచ్చినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ స్పష్టం చేసింది. రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 6.1గా నమోదైనట్లు పేర్కొంది. తెంజావల్కు 73కిలోమీటర్ల దూరంలో.. 12 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైనట్లు తెలిపింది. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు.





