
-
ప్రధాని ఇమ్రాన్ ఆందోళన
ఇస్లామాబాద్: దేశాన్ని నడిపేందుకు నిధులు లేవని పేర్కొంటూ దివాళా పరిస్థితుల్లో ఉన్నట్టు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పష్టమైన సంకేతం ఇచ్చారు. విదేశీ రుణాలు ఎక్కువ అయ్యాయని, ఇదే సమయంలో దేశంలో పన్నుల నుంచి వచ్చే ఆదాయం తగ్గిందని, ఇది దేశ భద్రతకు సమస్యగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
దేశ రాజధాని ఇస్లామాబాద్‌లో చక్కెర పరిశ్రమ కోసం ఫెడరల్ బ్యూరో ఆఫ్ రెవెన్యూకి చెందిన ట్రాక్ సిస్టమ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇమ్రాన్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం వెచ్చించడానికి సరిపడా నిధులు లేవని తెలిపారు.
‘‘మన దేశంలో(పాకిస్తాన్) అతిపెద్ద సమస్య ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడం. దేశాన్ని నడిపించడానికి, ప్రజా సంక్షేమంపై ఖర్చు చేసేందుకు నిధులు లేకపోవడం అతిపెద్ద సమస్యగా మారింది. ఈ సమస్యను అధిగమించాలంటే విదేశాల నుంచి రుణాలు తీసుకోక తప్పదు’’ అని ఆయన పేర్కొన్నారు.
Source: Nijamtodauy





