
కార్తార్‌పూర్: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ కర్తార్‌పూర్ సాహిబ్ పర్యటనలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ‘బడా భాయ్’(అన్నయ్య) అని సంబోధిస్తూ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. గతంలో ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారానికి పంజాబ్ మంత్రిగా ఉంటూ వెళ్లి సొంత పార్టీలోనే వివాదాలు సృష్టించడం తెలిసిందే.
పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ తన బృందంలో సిద్ధును మినహాయించి కర్తపూర్ యాత్రకు వెళ్లి వచ్చిన రెండు రోజుల తర్వాత పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్ సాహిబ్‌ను సందర్శించాడు. సిద్ధూకి కార్తార్‌పూర్‌లో ఘన స్వాగతం లభించింది. పాకిస్తాన్‌లో ఉన్న సిక్కులతో పాటు ఇతర స్థానికులు సిద్ధూపై పూలు చల్లుతూ స్వాగతం పలికారు.
పైగా, ఇమ్రాన్ ఖాన్ ప్రతినిధిగా పాకిస్థాన్ అధికారి ఒకరు అక్కడ సిద్ధుకు స్వాగతం పలికిన వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో, కాంగ్రెస్ నాయకుడు ఖాన్ తనకు ‘బడా భాయ్’ అని చెప్పడం వినిపిస్తోంది. పంజాబ్ ముఖ్యమంత్రికి లభించని స్వాగత, సత్కారాలు ఒక పార్టీ నేతకు లభించడం గమనార్హం. వెంటనే బీజేపీ నాయకులు సిద్ధు వ్యవహారంపై మండిపడ్డారు.
Source: Nijamtoday





