
-
మరో పూజా మందిరంలో ఖురాన్ పెట్టేందుకు విఫలయత్నం
-
నిందితుడు మిజాన్‌గా గుర్తించిన పోలీసులు
ఢాకా: బంగ్లాదేశ్‌లోని ముస్లింలకు మంచి బుద్ధి రావడం లేదు. అక్కడి హిందువులను లక్ష్యంగా హింసాత్మక సంఘటనలు రేగాలని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇటీవల మతోన్మాది ఇక్బాల్ హుస్సేన్ దుర్గా మందిర్‌లోకి ప్రవేశించి హనుమాన్ విగ్రహం పాదాలపై ఖురాన్ కాపీని ఉంచాడు. దీంతో మైనారిటీ హిందువులపై హింసాత్మక దాడులు సంభవించాయి. ఈ ఘోరాలు మరువకముందే మరో సంఘటన చోటుచేసుకుంది.
హబీగంజ్ పట్టణం, చౌదరి బజార్ ప్రాంతంలోని సర్బజనిన్ పూజా మండపంలోకి 25 ఏళ్ల యువకుడు ఖురాన్‌తో ప్రవేశిస్తుండగా భక్తులు పట్టుకున్నాడు. ఈ దుర్ఘటన నిన్న శుక్రవారం జరిగింది. నిందితుడు కొద్దిసేపటి నుంచి ఆ ప్రాంతంలో సంచరిస్తూ మధ్యాహ్న సమయంలో వెనుక ద్వారం నుంచి మండపంలోని వెళ్ళేందుకు విఫలయత్నం చేశాడు. నిందితుడిని తనిఖీ చేయగా, అతని బ్యాగ్‌లో ఖురాన్ లభించింది. దానిని స్వాధీనం చేసుకుని, పోలీసులకు అప్పగించారు.
నిందితుడు నౌఖాలీలోని బేగంగంజ్‌లోని లుయాత్‌పూర్ గ్రామానికి చెందిన మిజాన్‌గా గుర్తించారు. ‘అతని ఉద్దేశం, మిగతా విషయాలు తెలుసుకోవడానికి పోలీసులు అతనిని ప్రశ్నిస్తున్నారు’ అని హ బిగంజ్ సదర్ మోడల్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అధికారి దౌస్ మహ్మద్ మీడియాకు తెలిపారు. కాగా, తరచూ ఇటువంటి సంఘటనలు చోటుచేసుకుంటుడడంతో హిందువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Source: Dhaka Tribune





