
-
భారీ వర్షంతో తిరుమల గిరులు జలమయం
-
ఘాట్ రోడ్లపై విరిగిపడ్డ కొండ చరియలు
తిరుపతి: కుండపోత వర్షాలకు తిరుమల గిరులు వరద నీటితో నిండిపోయాయి. మాడవీధులు వాగులను తలపించాయి. గురువారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ల్లోకి నీరు చేరింది. ఎగువ నుంచి వచ్చిన వరద, బురద నారాయణగిరి వసతి సముదాయంలోకి చేరింది. పాపవినాశనం, జపాలి క్షేత్రాలి మార్గాల్లో పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహిస్తుండటంతో ఆ దారులను మూసివేశారు.
కనుమదారుల్లో వరద నీరు జలపాతాల మాదిరిగా పడుతుండటంతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. రెండో కనుమదారిలో 14 చోట్ల కొండచరియలు పడ్డాయి. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు కాలినడక మార్గంలో వరద నీరు ప్రవహిస్తుండటంతో ఈ మార్గాలను ఇప్పటికే మూసివేసిన తితిదే … శుక్ర, శనివారాలు అనుమతించేది లేదని స్పష్టం చేసింది. వన్యమృగాలు వరద భయంతో రోడ్లపైకి చేరాయి. మొదటి కనుమ రహదారిలో మాత్రమే భక్తులను అధికారులు అనుమతిస్తున్నారు.





