
603views
-
ఉత్తరాదిలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు
హరిద్వార్: కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవ్ దీపావళి వేడుకలు పలు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని హర్ కీ పౌడీ ఘాట్‌కు భక్తులు భారీగా తరలివచ్చారు. గురువారం రాత్రి 11 వేల దీపాలు వెలిగించి.. ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. వేలాది దీపాలు ఒకేచోట వెలుగుతుండటం అద్భుతమని అఖాడా పరిషత్ అధ్యక్షుడు రవీంద్ర పురీ అన్నారు.
హర్ కీ పౌడీలో జరుపుకొన్నట్టే వేడుకలను అన్ని దేవాలయాల్లో నిర్వహించాలని పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది అన్ని పుణ్యక్షేత్రాల్లో అత్యద్భుతంగా వేడుకలు ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టం చేశారు. ఈ రోజున దేవతలు దీపావళి జరుపుకొంటారని ఉత్తరాది ప్రజలు నమ్ముతారు. స్వర్గం నుంచి భూమికి చేరుకొని దీపం వెలిగిస్తారని విశ్వసిస్తారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





