
630views
-
అక్రమ నగదు చలామణీ కేసు
జమ్మూ: మనీలాండరింగ్ కేసుకు సంబంధించి పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సోదరుడు తస్సాదుక్ హుస్సేన్ ముఫ్తీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం విచారణకు పిలిచింది. జమ్మూకశ్మీర్ పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసిన తస్సాదుక్ హుస్సేన్ ముఫ్తీ నేడు న్యూఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో హాజరుకావాలని తెలిపింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల ప్రకారం అతని వాంగ్మూలాన్ని నమోదు చేయాలని ఈడీ ఆదేశించింది. తస్సాదుక్ హుస్సేన్ ఖాతాల్లోకి జమ్మూ కశ్మీర్‌లో ఉన్న కొంతమంది వ్యాపారవేత్తల నుంచి వచ్చిన నిధులకు సంబంధించి ప్రశ్నిస్తామని ఈడీ అధికారులు చెప్పారు.





