
572views
-
దేశంలో సురక్షితంగా మైనారిటీలు
-
బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా కితాబు
న్యూఢిల్లీ: భారత్లో ముస్లింలు సురక్షితంగా ఉన్నారని బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ అన్నారు. దేశంలో లౌకికవాదం చెక్కుచెదరలేదని కితాబిచ్చారు. భారత్లో ముస్లింలు సురక్షితంగా ఉన్నారని, పాకిస్థాన్, బంగ్లాదేశ్ తరహాలో మైనార్టీలకు ఇక్కడ ఎలాంటి భయాందోళనలు లేవన్నారు. అతితక్కువ సంఖ్యలో ఉన్న మతోన్మాదులను చూపి మొత్తం దేశమంతా ఇలాగే ఉందనడం సరికాదన్నారు.
”చాలామంది భారత్లో మునుపటి లౌకికవాదం లేదంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. నాకైతే అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. దేశంలో లౌకికవాదానికి రాజ్యాంగమే రక్షణగా ఉంది. కొన్నిసార్లు, కొన్నిప్రాంతాల్లో హిందూ, ముస్లిం వర్గాల మధ్య స్వల్ప ద్వేషం ఉంటుంది. అలాగని ఇక్కడి మైనార్టీలు ఎక్కడికీ వలస వెళ్లడం లేదు. పొరుగు దేశాల్లో ఇలాంటి పరిస్థితులు లేవు” అన్నారు.





