News

శ్రీలంకలో ‘ఏవియేటర్‌ రావణ’

590views

కొలంబో: భారత దేశానికి ఇదో శుభవార్త… హిందూ ఇతిహాసాల్లోని విషయాలపై పరిశోధనలు శ్రీలంకలో ప్రారంభమయ్యాయి. ఈ శోధన ఇప్పటికే మొదలైనప్పటికీ కరోనా వల్ల నిలిచిపోయింది. మళ్ళీ తాజాగా అడుగులు పడుతున్నాయి. రావణుడి వద్ద విమానాలున్నాయని ఇతిహాసాలలో చెప్పిన అంశాలపై సమగ్ర అధ్యయనానికి శ్రీలంక ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్‌ పేరే ‘ఏవియేటర్‌ రావణ’.

ఈ పరిశోధనల‌కు సహకరించాలని భారత్‌ను లంక ప్రభుత్వం కోరింది. రావణుడి విమానాల ఉనికిపై నిజానిజాలు తెలుసుకొనే క్రమంలో శ్రీలంక సర్కార్‌ పరిశోధన మొదలు పెట్టింది. దీనికోసం ఓ పరిశోధక బృందాన్ని శ్రీలంక సర్కార్‌ ఏర్పాటుచేసింది. రెండేళ్ల కిందట పౌర విమానయాన నిఫుణులు, చరిత్రకారులు, శాస్త్రవేత్తలు, పురావస్తు శాఖ అధికారుల సమావేశం జరిగింది. రావణుడు తన విమానంలో భారత్‌కు ప్రయాణించాడని ఈ భేటీలో నిర్ధారించారు. ఇక ఈ విషయంపై పూర్తిస్థాయి పరిశోధనలకు లంక ప్రభుత్వం అయిదు మిలియన్‌ శ్రీలంకన్‌ రూపీస్‌(రూ.18.41 లక్షలు) వెచ్చిస్తున్నట్టు వెల్లడైంది. ఇది శ్రీలంక జాతీయ ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టుగా ప్రభుత్వం అంగీకరించింది.

  • ముందడుగు..

ఈ పరిశోధనల్లో పెద్ద ముందడుగు ప‌డింది. శ్రీలంక సర్కార్‌ లంకలో ఐదు విమానాశ్రయాలను గుర్తించింది. గుర్లపోత వద్ద ఒక విమానాల మరమ్మతు కేంద్రాన్ని సైతం ఉన్నట్టు శ్రీలంక పరిశోధకులు చెబుతున్నారు. వీటన్నింటిని హనుమంతుడు కాల్చి వేశాడని వారంటున్నారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి