News

ప్రశ్నిస్తున్న వారికి ‘పూర్వాంచల్‌’ సమాధానం

533views
  • ఎక్స్‌ప్రెస్‌ వే ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ

లక్నో: పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌ వేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు. లక్నో నుంచి ఉత్తరప్రదేశ్‌ రాజధాని ఘాజీపూర్‌ వరకు 340.8 కిలోమీటర్ల పొడవైన ఈ ఎక్స్‌ప్రెస్‌వేపై 3.2 కిలోమీటర్ల ఎయిర్‌ స్ట్రిప్‌ కూడా తయారు చేశారు. దీని వల్ల యుద్ధ విమానాలను అత్యవసరంగా ల్యాడింగ్‌ చేసేందుకు వీలుగా ఉంటుంది. ఎయిర్‌స్ట్రిప్‌ వద్ద గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రధానికి స్వాగతం పలికారు.

341 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌వే రాష్ట్ర రాజధాని లక్నోను ఘాజీపూర్‌తో కలుపుతుంది. రూ. 22,500 కోట్ల అంచనా వ్యయంతో దీనిని నిర్మించారు. ఎయిర్‌స్ట్రిప్‌ వేదిక నుండి ప్రధాని వివిధ విమానాల ద్వారా ఎయిర్‌ షోను తిలకించారు. ఈ వే చౌదసరాయ్‌ గ్రామం నుండి ప్రారంభమవుతుంది. లక్నో జిల్లా లక్నో-సుల్తాన్‌పూర్‌ రహదారి ఎన్‌హెచ్‌-731లో ఉంది. ఉత్తరప్రదేశ్‌-బీహార్‌ సరిహద్దుకు తూర్పున 18 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి నంబర్‌ 31పై ఉన్న హైదరియా గ్రామం వద్ద ముగుస్తుంది. ఎక్స్‌ప్రెస్‌వే 6-లేన్‌ల వెడల్పుతో భవిష్యత్తులో 8-లేన్‌లకు విస్తరించనున్నారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి