News

బిర్సా గుర్తుగా మ్యూజియం ప్రారంభించిన ప్రధాని

410views

రాంచీ: స్వాతంత్య్ర సమరయోధుడు, జల్‌-జంగల్‌-జమీన్‌ ఉద్యమ నేత బిర్సా ముండా గుర్తుగా జార్ఖండ్‌ రాజధాని రాంచీలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మ్యూజియాన్ని ప్రారంభించారు. సోమవారం జరిగిన వీడియో కాన్ఫరేన్స్‌లో పాల్గొన్న మోదీ.. రిమోట్‌ ద్వారా మ్యూజియాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ బిర్సా ముండా చేసిన సేవ దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని కొనియాడారు.

ఆదివాసీల కోసం ఆయన ఎంతో పోరాటం చేశారని, స్వాతంత్య్రం కోసం పదునైన ఉద్యమాన్ని చేపట్టారని మోదీ అన్నారు. బిర్సా ముండా జయంతిని ప్రభుత్వం ‘జంజతియ గౌరవ్‌ దినోత్సవం’గా నిర్వహిస్తోంది. కాగా, బిర్సా ముండా జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఈ రోజు మధ్యప్రదేశ్‌లో పర్యటించనున్నారు. అనంతరం గిరిజనుల ప్రయోజనార్థం పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నట్టు ఆదివారం పీఎంవో పేర్కొంది. 1875 నవంబర్‌ 15న జన్మించిన బిర్సా ముండా.. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా స్వాతంత్య్ర పోరాటం నిర్వహించారు. ఈ పోరాటంలో కొనసాగిస్తూనే 1900 ఏడాదిలో అతి చిన్న వయసులో (25) మృతి చెందారు.

Source: Andhrajyothy

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి