News

భార‌త్‌కు అందనున్న రష్యా ఎస్400 క్షిపణులు

480views

న్యూఢిల్లీ: రష్యా నుంచి భారత్‌ కొనుగోలు చేసిన ఎస్​-400 క్షిపణుల అందజేత ప్రక్రియ ప్రారంభమైనట్టు రష్యా ఉన్నతాధికారులు తెలిపారు. మొదటి నుంచి రక్షణ రంగంలో కీలక ఆయుధ సామగ్రిని రష్యా నుంచి కొనుగోలు చేసేందుకు భారత్​ ప్రాధాన్యమిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా నుంచి ఎస్​-400 గగనతల రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసుకునేందుకు 2018, అక్టోబర్​లో ఒప్పందం కుదుర్చుకుంది. 5 క్షిపణుల కొనుగోలు కోసం.. 500 కోట్ల​ డాలర్లను ఖర్చు చేస్తోంది. ఇప్పటికే గతేడాది 800 మిలియన్​ డాలర్లను రష్యాకు చెల్లించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి