News

పారదర్శక పరిపాలనకు ‘చింతన్ శివిర్’

456views
  • ప్ర‌ధాన మంత్రి మోదీ కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: సాంకేతికతను ఉపయోగించుకుని పారదర్శక పాలన అందించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రి మండలిలోని 77 మంది మంత్రులను ఎనిమిది గ్రూపులుగా విభజించనున్నారు. ప్రతి గ్రూప్​లోనూ కొంతమంది నైపుణ్యం కలిగిన యువకులను, రిటైర్డ్​ అధికారులను నియమించనున్నారు. వీరి నుంచి సలహాలను తీసుకొని మెరుగైన విధానాలను రూపొందించి అమలు చేయనున్నారు. మంత్రుల కార్యాలయాల్లో మరింత పారదర్శకతను పెంపొందిచే దిశగా ఈ నిపుణుల బృందం ఇంకా ఎక్కువ మందిని నియమించకుకోనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.

మంత్రి మండలిని మొత్తం ఎనిమిది గ్రూపులుగా విభజించే కసరత్తు అంతా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ‘చింతన్​ శివిర్’ పేరుతో నిర్వహించారు. వీటిలో వ్యక్తిగత సామర్థ్యం, ​సమర్థవంతమైన అమలు, మంత్రిత్వ శాఖ పనితీరు, పార్టీ సమన్వయం, నైపుణ్యాలు పెంపొందించే విధానాలు, అనుసరించాల్సిన పార్లమెంటరీ పద్ధతులపై చర్చించారు. ఈ సమావేశాలకు పార్లమెంట్​ ఉభయ సభాధిపతులు హాజరయ్యారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి