
594views
-
పుణ్యస్నానానికి వెళ్ళి నలుగురి గల్లంతు
విజయవాడ: విశాఖ, కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కార్తీక పుణ్యస్నానాల కోసం నదిలోకి దిగిన నలుగురు గల్లంతయ్యారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం తోటవల్లూరులో కృష్ణానదిలో ముగ్గురు గల్లంతు అయ్యారు. కార్తీక సోమవారం కార్తీక స్నానాలు చేసేందుకు ముగ్గురు యువకులు నరేంద్ర, నాగరాజు, పవన్ నదిలోకి దిగారు. నీటి ప్రవాహం గమనించకపోవడంతో ముగ్గురు యువకులు కొట్టుకుపోయారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. గల్లంతైనవారిలో ఇద్దరి మృతదేహాలు దొరికాయి. మరో యువకుడికి కోసం గాలిస్తున్నారు. విశాఖ జిల్లా గోస్తని నదిలో స్నానానికి దిగి తొమ్మిదేళ్ల బాలుడు గల్లంతు అయ్యాడు. పద్మనాభం మండలం పాండ్రంగిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Source: Tv9





