News

కేరళలో వరద బీభత్సం

561views
  • రెడ్ అలర్ట్ ప్రకటన

తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురం, కొల్లాం, పథనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో శనివారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో రహదారులు నీటమునిగాయి, ధ్వంసమయ్యాయి. కొండచరియలు విరిగిపడి రైలు పట్టాలపై పడటంతో సర్వీసులకు అంతరాయం కల్గింది. రాబోయే 24 గంటల్లో మధ్య కేరళ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎర్నాకులం జిల్లాలో కొండచరియలు విరిగిపడి ఓ వ్యక్తి మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. ఎర్నాకులం, ఇడుక్కి, త్రిస్సూర్‌ జిల్లాల్లో ప్రభుత్వం రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. పథనంతిట్ట, కొల్లాం జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ముల్లపెరియార్‌ జలాశయం నిండుకుండలా మారింది. దీంతో సమీప ప్రజలను అప్రమత్తం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి