
భారత్ ను అవమానించేలా వేసిన ఒక కార్టూన్ కు అవార్డు ఇవ్వడంతో కేరళ లలిత కళా అకాడమీ మరో వివాదంలో చిక్కుకుంది. గ్లోబల్ పాండమిక్ సమ్మిట్‌లో యునైటెడ్ స్టేట్స్, చైనా మొదలైన ఇతర ప్రపంచ ప్రతినిధులతో పాటు భారత్ తరపున ఆవు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు పేర్కొన్న కార్టూన్ చిత్రీకరించబడింది.
దీనిపై అకాడమీ చైర్మన్ నెమం పుష్ప రాజ్ ను సంప్రదించగా, కార్టూనిస్ట్ ఇ.పి ఉన్ని నేతృత్వంలోని జ్యూరీయే ఈ అవార్డును ఇవ్వడానికి నిర్ణయం తీసుకుందని, తనకు దీనితో ఏ సంబంధమూ లేదని తెలియజేశారు. కానీ పుష్పరాజ్ కథణానికి విరుద్ధంగా, ఆ తర్వాత లలిత కళా అకాడెమీ మీడియాకు ఇచ్చిన పత్రికా ప్రకటనలో మొత్తం ఎంపిక ప్రక్రియలో అకాడమీ చైర్మన్ నేమోమ్ పుష్ప రాజ్ కూడా భాగమేనని పేర్కొంది.

కొద్దిరోజుల క్రితమే ఈ అవార్డు ప్రకటించినప్పటికీ, ఆ కార్టూనిస్టు స్వయంగా తన ఫేస్‌బుక్ లో ఆ చిత్రాన్ని ప్రచురించిన తర్వాతే ఆ కార్టూన్ గురించి ప్రజలకు తెలిసింది. ఆ తర్వాత ఈ కార్టూన్ పై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు మన దేశాన్ని చిన్నచూపు చూడాలని, అగౌరవపరచాలని నిర్ణయించుకుంటే భారత దేశభక్తులకు ఇలాంటి దేశ వ్యతిరేక కార్యకలాపాలను తీవ్రంగా వ్యతిరేకించడం తప్ప మరో మార్గం ఉండదని హెచ్చరించారు.
Source : VSK KERALA





