News

దామోదరం సంజీవయ్యకు ఘన నివాళి

628views

మరసతా వేదిక రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మన్మథరావు గారి నేతృత్వంలో 13 నవంబర్ ఉ.10.30 కు సంజీవయ్య గారి జనన గ్రామం “పెదపాడు”లో వారి ఇంటి వద్ద వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కర్నూల్ నగరంలో మూడు చోట్ల సంజీవయ్య గారి విగ్రహాలకు పూల మాలలను సమర్పించారు.

సా.6.00 గం.లకు పాత బస్టాండ్ సమీపంలోని డా.అంబేడ్కర్ విగ్రహం వద్ద జోరు వానలో సమరసతా వేదిక ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది. డా.అంబేడ్కర్ విగ్రహానికి, సంజీవయ్య చిత్రపటానికి వక్తలు పూలమాలలు వేయడంతో సభ ప్రారంభమయింది. డా. వడ్డి విజయసారథి వ్రాసిన శ్రీ దామోదరం సంజీవయ్య గారి జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ జరిగింది. గౌరవ ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారి సందేశాన్ని చదివి వినిపించారు. సభకు శ్రీ మన్మధరావు అధ్యక్షత వహించిగా, డా. వడ్డి విజయసారథి, ప్రొఫెసర్ జనప వెంకటరాజం, ఉస్మానియా యూనివర్సిటీ, జి.రఘురామయ్య, లక్ష్మీనారాయణ, న్యాయవాది, మాజీ మేయర్ అనంతయ్య ప్రసంగించారు.

తీర్మానాలు:

పెదపాడు గ్రామంలో సంజీవయ్య గారి విగ్రహం పెట్టాలని, కమ్యూనిటీ హాల్ నిర్మించి అందులో వారి జీవన విశేషాలను తెలిపే చిత్ర ప్రదర్శిని ఏర్పాటు చేయాలని, గ్రామీణ యవత ఉపాధి కల్పన కొరకు సాంకేతిక శిక్షణా సంస్థను స్థాపించాలని, కర్నూలు జిల్లాకు శ్రీ దామోదరం సంజీవయ్య గారి పేరు పెట్టాలని సభ తీర్మానించింది. సభ ప్రారంభంలో కళాకారులు తమ పాటలతో ప్రజలను ఆకట్టుకున్నారు.సభ చివరలో సంజీవయ్యగారు స్వయంగా వ్రాసి స్వరకల్పన చేసిన రెండు పాటలను సరస్వతీమాత, వినాయకుని పాటలను పాడి వినిపించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.