News

తొలిసారిగా కామన్వెల్త్ క్రీడల్లో మహిళా టీ20

496views
  • భారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య పోటీతో ప్రారంభం

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది బర్మింగ్‌హామ్‌ వేదికగా జరిగే కామన్వెల్త్‌ క్రీడల్లో మహిళల క్రికెట్‌ పోటీలు జరగనున్నాయి. భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌తో ఇవి ప్రారంభమవుతాయి. జులై 29న ఈ మ్యాచ్‌ జరుగుతుంది. టీ20ల రూపంలో తొలిసారి మహిళల క్రికెట్‌ ను కామన్వెల్త్‌ క్రీడల్లో ప్రవేశపెడుతున్నారు. చివరిగా 1998లో ఈ క్రీడల్లో క్రికెట్‌ ఆడారు. తొలి రోజు భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌తో పాటు పాకిస్థాన్‌-బార్బడోస్‌ పోరు కూడా జరగనుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జులై 31న భారత్‌ తలపడబోతోంది. ఈ టోర్నీలో ఆడే ఎనిమిది క్వాలిఫయింగ్‌ జట్లలో ఇప్పటికే ఏడు జట్లు ఖరారు కాగా.. చివరి జట్టు ఇంకా తేలాల్సి ఉంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి