
-
భారత్ వచ్చే ఐదేళ్లలోపు చిన్నారులకు కరోనా పరీక్షల నుంచి మినహాయింపు
న్యూఢిల్లీ: భారత్ వచ్చే ఐదేళ్లలోపు చిన్నారులకు కరోనా పరీక్షల నుంచి ప్రభుత్వం మినహాయింపు వచ్చింది. ఈ మేరకు అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలపై కేంద్రం మార్గదర్శకాలు జారీచేసింది. ఒకవేళ హోం క్వారంటైన్ సమయంలో కరోనా వెలుగుచూస్తే చిన్నారులకు పరీక్షలు చేయించాలని, పాజిటివ్ అని వెల్లడైతే చికిత్స చేయించాలని స్పష్టం చేసింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదిత కొవిడ్ టీకాల విషయంలో భారత్ పరస్పర సర్దుబాట్లు చేసుకున్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు పూర్తిస్థాయి టీకా తీసుకుంటే వారిని విమానాశ్రయం నుంచి నేరుగా వెళ్లిపోవడానికి అనుమతిస్తారు. క్వారంటైన్ అవసరం లేదు. అదే సమయంలో వారు.. దేశంలోకి ప్రవేశించిన తర్వాత 14 రోజులపాటు తమ ఆరోగ్యాన్ని స్వయంగా పర్యవేక్షించుకోవాల్సి ఉంటుంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు భారత్‌లో క్వారంటైన్ మినహాయింపు కోసం.. రెండు డోసుల టీకా తీసుకున్న తర్వాత 15 రోజులు పూర్తవ్వాలన్న నిబంధన మాత్రం కొనసాగుతుంది.





