News

జేకేలోని కుల్గాంలో ఎన్‌కౌంటర్‌

395views
  • హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది హతం

  • కొనసాగుతున్న ఆపరేషన్‌

కుల్గాం: జమ్మూకశ్మీర్‌లోని కుల్గాంలో ఈ రోజు ఉదయం ఎన్‌కౌంటర్‌ జరిగింది. హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదిని భద్రతా దళాలు హతమార్చాయి. ఈ మేరకు కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కూడా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. నిన్న గురువారం ఉదయం ప్రారంభించిన ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. కాగా, ఇప్పటి వరకు ఇద్దరిని భద్రతాదళాలు మట్టుబెట్టాయి. వీరు జిల్లా కమాండర్లు హెచ్‌ఎం షిరాజ్‌ మోల్వి, యావర్‌ భట్‌లుగా గుర్తించారు.

‘షిరాజ్‌ 2016 నుండి ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. అమాయక యువకులను తీవ్రవాద ర్యాంకుల్లోకి తీసుకువెళ్ళాడు. ఇంకా అనేక పౌర హత్యలకు రిక్రూట్‌ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మాకు ఇది పెద్ద విజయం’ అని కాశ్మీర్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ విజయ్‌ కుమార్‌ అన్నారు. ఇదిలావుండగా, గురువారం శ్రీనగర్‌ ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదిని నిషేధిత ఉగ్రవాద సంస్థ ముజాహిదీన్‌ గజ్వాతుల్‌ హింద్‌కు చెందిన వాడిగా గుర్తించినట్టు జమ్మూ కాశ్మీర్‌ పోలీసులు శుక్రవారం తెలిపారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి