News

తిరుమల ఘాట్ రోడ్లపైకి భక్తులకు అనుమతి

551views

తిరుప‌తి: వర్షం తగ్గడంతో తిరుమల ఘాట్‌ రోడ్లలో భక్తులను ఉదయం ఆరు గంట‌ల‌ నుంచి అనుమతిస్తున్నట్టు అధికారులు చెప్పారు. భారీ వర్షం కారణంగా నిన్న రాత్రి ఎనిమిది గంటలకు రెండు కనుమదారులు మూసివేశారు. మెట్ల మార్గంలో భారీగా వరద నీరు చేరడంతో జలపాతాన్ని తలపించింది. అటవీ ప్రాంతంలో నుంచి వచ్చిన బురద నీటితో మెట్లపై మట్టి పేరుకుపోయింది. దీంతో.. ఈ మార్గాన్ని మూసివేసి భక్తుల రాకపోకలను నిలిపివేశారు. పేరుకుపోయిన బురదను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. నడిచి కొండపైకి వెళ్లాలనే భక్తులను శ్రీవారి మెట్ల మార్గం నుంచి అనుమతిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి