
473views
-
ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ
న్యూఢిల్లీ: న్యాయ విద్యను అభ్యసిస్తున్న వారితో పాటు.. న్యాయవాదులు సమాజంలోని అణగారిన వర్గాల గొంతుకుగా ఉండేలా శక్తిమంతం కావాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆకాక్షించారు. న్యాయవాద వృత్తి లాభాలను అర్జించడం కోసం కాదని, సమాజానికి సేవ చేసేందుకేనని అభిప్రాయపడ్డారు. జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని పురస్కరించుకుని నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ(నల్సా) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నల్సా ఆధ్వర్యంలో నిర్వహించే మూట్ కోర్ట్ పోటీల్లో పాల్గొని ఉత్సాహం చూపిన యువ న్యాయ విద్యార్థుల పట్ల జస్టిస్ ఎన్వీ రమణ హర్షం వ్యక్తం చేశారు.





