News

జాతీయ విద్యా విధానం లక్ష్యం.. అత్యుత్తమ పౌరుల తయారు

663views
  • కరోనా కారణంగా మందగించిన అమలు

  • యూజీసీ చైర్మన్ వ్యాఖ్య

న్యూఢిల్లీ: భారత్​లో జాతీయ విద్యా విధానం-2020 అమలుపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఛైర్మన్ ప్రొఫెస‌ర్‌ ధీరేంద్రపాల్​ సింగ్​ కీలక వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ మహమ్మారి కారణంగా.. ఎన్​ఈపీ అమలుపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. అయితే, ఎన్​ఈపీని సరైన సమయంలోనే తీసుకొచ్చారని తెలిపారు. జాతీయ విద్యా విధానాన్ని సమర్థవంతంగా తీసుకువెళ్ళేందుకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాల వైస్​ ఛాన్సెలర్లతో కేంద్రం చర్చలు జరుపుతుంద‌ని ధీరేంద్రసింగ్​ తెలిపారు.

ఎన్​ఈపీలోని కొన్ని కార్యకలాపాలు ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రారంభమయ్యాయన్నారు. 2022 జులై నుంచి దేశవ్యాప్తంగా ఈ పాలనీని అమల్లోకి తెచ్చేందుకు కేంద్రం సమాయత్తమవుతుంద‌ని తెలిపారు. విద్యార్థులకు దేశ సంస్కృతి, సంప్రదాయాలను నేర్పించటమే కాక.. ప్రపంచంలోనే ఉత్తమ పౌరులుగా విద్యార్థులను జాతీయ విద్యా విధానం(ఎన్​ఈపీ) తీర్చిదిద్దుతుందన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి