
-
18 మంది దుర్మరణం
-
భారీ సంఖ్యలో క్షతగాత్రులు
నైజీరియా: నైజీరియాలోని దక్షిణ నైజర్‌లో పెను విషాదం సంభవించింది. ఆర్టిసానల్ గోల్డ్ మైన్ కూలి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టింది. ఈ ప్రమాదాన్ని డాన్ ఇస్సా జిల్లా మేయర్ అడమౌ గురౌ ధ్రువీరించారు. ప్రస్తుతానికి 18 మంది చనిపోయారని, మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. గ్యారిన్-లిమాన్ గని స్థలంలో ఆర్టిసానల్ బావులు కూలిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయని, శిథిలాల్లో ఇంకా మృతదేహాలు చిక్కుకుని ఉండవచ్చునని అన్నారు.
కాగా, ఈ గ్యారిన్-లిమాన్ గనులను కొన్ని నెలల క్రితమే కొనుగొన్నారు. అక్కడ తవ్వకాలు చేపట్టారు. అయితే, అక్కడి నేల అస్థిరత కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానిక నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయని వారు తెలిపారు. మైనింగ్‌లో పాత పద్ధతులు పాటించడం కూడా ఈ ప్రమాదానికి ఒక కారణం అని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే మైనింగ్ సెక్టార్‌ను ఆధునీకరించే ప్రయత్నాల్లో భాగంగా అక్కడి ప్రభుత్వం 2017లోనే అనేక ఆర్టిసావల్ గోల్డ్‌మైన్‌లను మూసివేసింది.
Source: Tv9





