News

అనంతపురంలో ఉద్రిక్తత

479views
  • విద్యార్థులపై పోలీసుల దాడి

  • నేడు బంద్‌కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు

అనంతపురం: ఏపీలోని అనంతపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థులపై పోలీసుల దాడిని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు నేడు అనంతపురం జిల్లాలో బంద్‌కు పిలుపునిచ్చాయి. విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్‌ని పలువురు నేతలు ఖండిరచారు. అనంతపురంలో ఎస్‌ఎస్‌బీఎన్‌ ఎయిడెడ్‌ కళాశాల, పాఠశాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు రోడ్డెక్కారు. ఎయిడెడ్‌ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దంటూ ఎస్‌ఎస్‌బీఎన్‌ కాలేజీ దగ్గర విద్యార్థులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చదువులను వ్యాపారం చేస్తోందని ధర్నాకు దిగారు.

ఆందోళన చేస్తున్న సమయంలో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. పోలీసుల లాఠీఛార్జ్‌లో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. లాఠీఛార్జ్‌ అనంతరం పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు లాఠీఛార్జ్‌కి దిగారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఎయిడెడ్‌ కాలేజీలు, స్కూళ్ల విలీనం వ్యతిరేకిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. ఎస్‌ఎస్‌బీఎన్‌ కాలేజీ దగ్గర విద్యార్థులు, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎప్‌ విద్యార్థి సంఘాలు, విద్యార్థి నాయకులు నిరసన చేపట్టారు. ఈ నిరసనలో విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. ఎస్‌ఎస్‌బీఎన్‌ కాలేజీ, స్కూల్‌ విలీనాన్ని వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి