News

కేంద్ర సాయుధ బలగాలకు ఆయుష్మాన్ భారత్ – వెల్లడించిన అమిత్ షా

551views

యుష్మాన్ భారత్ సీఏపీఎఫ్ పథకాన్ని కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో సీఏపీఎఫ్ జవానుకు ఆయుష్మాన్ కార్డు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అందించారు. అన్ని రాష్ట్రాల్లో దశలవారీగా కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు.

ఆయుష్మాన్ సీఏపీఎఫ్ పథకం ఈ ఏడాది జనవరి 23న అసోంలోని గువాహటిలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైంది. కేంద్ర హోంశాఖ, జాతీయ వైద్య ప్రాధికార సంస్థ(ఎన్​హెచ్ఏ) సంయుక్తంగా ఈ పథకాన్ని తీసుకొచ్చాయి. సీఏపీఎఫ్ సిబ్బందికి క్యాష్​లెస్, పేపర్ లెస్ విధానంలో వైద్య సేవలు అందించేలా దీన్ని రూపొందించారు. తాజాగా ప్రారంభమైన హెల్త్ కార్డుల పంపిణీ ఈ ఏడాది డిసెంబర్​లో పూర్తికానుంది. మొత్తం 35 లక్షల కార్డులు పంపిణీ చేయనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.