News

పాకిస్తాన్‌లోని హిందూ ఆలయంలో దోపిడి

678views

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌.. సింధ్ ప్రావిన్స్‌లోని హిందూ దేవాలయంలో మరో దారుణం జరిగింది. దేవాలయంలోకి దుండగులు చొరబడి అమ్మవారి మూడు వెండి హారాలు, నగదును దోచుకెళ్లారు. సింధ్‌ పరిధిలోని కోత్రి ప్రాంతంలో ఉన్న దేవి మాత ఆలయంలో హుండీ నుంచి రూ.25వేల రూపాయల డబ్బుతోపాటు దేవతల మెడలో ఉన్న మూడు వెండి హారాలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఆలయ సంరక్షకుడు భగవాన్‌దాస్‌ ఫిర్యాదు మేర పాక్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వారని పాక్ పోలీసులు తెలిపారు. చోరీ సమయంలో దొంగలు ఆలయ దేవతలను అపవిత్రం చేశారన్న వాదనలను పోలీసులు తోసిపుచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి