News

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఎన్‌కౌంట‌ర్‌, ముగ్గురు మావోల మృతి

495views

దంతెవాడ‌: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. ఈ సంఘ‌ట‌న‌లో ముగ్గురు మ‌హిళా మావోయిస్టుల మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్‌ దంతెవాడ జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మహిళా నక్సల్స్‌ మృతి చెందారు. దంతెవాడ జిల్లా అడ్వాల్‌-కుంజెరాస్‌ అటవీప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నక్సల్స్‌ మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరణించిన మహిళా నక్సల్స్‌పై రూ.5 లక్షల చొప్పున రివార్డు ఉంది. ఘటనాస్థలంలో ఆయుధాలు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు.

దంతేవాడలో భారీగా మావోయిస్టుల లొంగుబాటు

దంతెవాడలో పెద్దఎత్తున మావోయిస్టులు లొంగిపోయారు. వీరంతా 2017లో సురేందర్‌గఢ్​లోని భద్రతా సిబ్బందిపై దాడి ఘటనలో నిందితులుగా ఉన్నారని పోలీసులు తెలిపారు. అప్పటి ఘటనలో 25 మంది సీఆర్​పీఎఫ్​ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ’14 మంది మావోయిస్టులు లొంగిపోయారని.. వీరిలో కీలక సభ్యుడైన సన్నా మార్కం ఉన్నాడని’ దంతెవాడ ఎస్పీ తెలిపారు. ఇతనిపై లక్ష రూపాయల రివార్డు ఉందన్నారు. సుక్మా జిల్లా బుర్కపల్​లో 2017లో సీఆర్​పీఎఫ్​ సిబ్బందిపై జరిగిన ఆకస్మిక దాడిలో మార్కం పాల్గొన్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

గతేడాది జూన్‌లో పోలీసులు ప్రారంభించిన ‘లోన్ వర్రాటు’లో భాగంగా ఇప్పటివరకు 454 మంది నక్సల్స్ లొంగిపోయారని పోలీసులు తెలిపారు. వీరిలో 117 మందిపై నగదు రివార్డు ఉన్నట్టు వివరించారు. నక్సల్స్ లొంగుబాటు కోసం దంతెవాడ పోలీసులు గత కొంతకాలంగా.. ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రధాన స్రవంతిలోకి తిరిగి వచ్చేలా వారిని ప్రోత్సహిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి