
749views
న్యూఢిల్లీ: భారత సైన్యంలో మరో 39 మంది మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ హోదా దక్కింది. ఈ మేరకు భారత ఆర్మీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ హోదా కోసం వీరు సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. అక్కడ అధికారిణులకు విజయం లభించింది. నవంబరు ఒకటోతేదీలోగా మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కేంద్రాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.





