News

భారత్‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు

668views
  • ముమ్మరంగా వ్యాక్సినేషన్

న్యూఢిల్లీ: దేశంలో కొన్ని రోజులుగా కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో (మంగళవారం) దేశవ్యాప్తంగా 13,451 కొత్త కేసులు నమోదయ్యాయి. 585 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

నిన్న కరోనా నుంచి 14,021 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 98 శాతానికి పైగా ఉంది. మార్చి తర్వాత కరోనా రికవరీ రేటు భారీగా పెరిగింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,03,53,25,577 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. గత 24గంటల్లో 55,89,124 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు ఆరోగ్య శాఖ తెలిపింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి