
-
కశ్మీరీ విద్యార్థులను నిలదీసిన యూపీ, బీహార్ విద్యార్థులు
సంగ్రూర్: టీ20 ప్రపంచకప్‌లో పాక్ చేతిలో భారత్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ప్రపంచకప్‌లో భారత్ ఓడిపోయిందనే అక్కసుతో తమపై కొందరు దాడులకు పాల్పడ్డారని కశ్మీర్‌కి చెందిన విద్యార్థులు ఆరోపించారు. పంజాబ్‌లోని సంగ్రూర్ భాయ్ గురుదాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. దాడి గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపుచేశారు. కొన్ని మీడియా సంస్థలు ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రచురించాయి.. కానీ ముఖ్యమైన సమాచారాన్ని అందించలేదు.
ఓ కశ్మీరీ విద్యార్థి మాట్లాడుతూ ‘మేము ఇక్కడ మ్యాచ్ చూస్తున్నాం.. యూపీకి చెందిన విద్యార్థి అడ్డుపడ్డాడు.. మేము ఇక్కడ చదువుకోవడానికి వచ్చాం.. మే కూడా భారతీయులమే.. మాకు ఏమి జరిగిందో మీరు చూడండి… మేము భారతీయులం కాదా? మోదీ ఏం చెబుతారు?’ అని చెప్పాడని మీడియా సంస్థలో కథనాలు వచ్చాయి. దాడికి సంబంధించిన వీడియోలను విద్యార్థులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ వార్తా సంస్థలు… గొడవలు జరిగాయి, కొట్టుకున్నారు అని చెబుతూ వచ్చారు తప్పితే.. ఎందుకు గొడవ జరిగిందో మాత్రం వెల్లడిరచలేదు. పంజాబ్ పోలీసులు ఇచ్చిన నివేదికను మాత్రం ప్రస్తావించలేదు. మ్యాచ్ సమయంలో కొందరు కశ్మీరీ విద్యార్థులు పాక్‌కు మద్దతు ఇచ్చారని.. అదే ఘర్షణకు దారితీసిందని పంజాబ్ పోలీసుల ప్రకటనలో ఉంది. దీని గురించి మాత్రం ఆ మీడియా సంస్థల్లో చర్చించలేదు. భారత్‌పై పాక్ విజయం సాధించిన నేపథ్యంలో కశ్మీరీ విద్యార్థులు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారని పోలీసులు వెల్లడించారు.
సంగ్రూర్‌కు చెందిన సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ ‘కళాశాలలో దాదాపు 90 మంది కశ్మీరీ విద్యార్థులు ఉంటారు.. యూపీ, బీహార్‌లకు చెందిన 30 మంది విద్యార్థులు ఉన్నారు. కశ్మీరీ విద్యార్థులు హాస్టల్‌లోని రెండు బ్యారక్‌లలో ఉంటారు. మ్యాచ్ జరుగుతుండగా పాకిస్తాన్ విజయం దిశగా వెళుతున్న సమయంలో కశ్మీరీ విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. అంతే కాకుండా, ఆజాదీ నినాదాలు కూడా చేశారు’’ అంటూ తెలిపారు.
మ్యాచ్ ముగిసిన తర్వాత, యూపీ, బీహార్ విద్యార్థులు కశ్మీరీ విద్యార్థుల గదుల్లోకి వెళ్లి వారితో గొడవ పడ్డారు. యూపీ, బీహార్‌కు చెందిన విద్యార్థులతో కశ్మీరీ విద్యార్థులు కూడా ఘర్షణకు దిగారు. పోలీసులు, కళాశాల అధికారులు రాత్రికి రాత్రే పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు అని పోలీసు అధికారి తెలిపారు.
Source: NationalistHub





